PM Kisan: పీఎం కిసాన్‌ యోజనలో మరో కొత్త మార్పు.. ఇక వారికి నోటీసులు జారీ..!

PM Kisan New Update Check Now Whether You Will Have to Return Installment
x

PM Kisan: పీఎం కిసాన్‌ యోజనలో మరో కొత్త మార్పు.. ఇక వారికి నోటీసులు జారీ..!

Highlights

PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారు అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.

PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారు అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఈ పథకం కింద డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయకుంటే లేదా తప్పుగా డబ్బులు తీసుకుంటుంటే ఇప్పటి వరకు పొందిన అన్ని వాయిదాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైనప్పటి నుంచి దానిలో 8 పెద్ద మార్పులు జరిగాయి. పీఎం కిసాన్ యోజన కింద 10వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లోకి చేరింది.

ఇప్పుడు 11వ విడత పొందేందుకు అనేక పత్రాలు తప్పనిసరి చేశారు. అందులో భాగంగా ఈ-కెవైసి చేయడాన్ని తప్పనిసరి చేశారు. దీంతో పాటు ప్రభుత్వం మళ్లీ కొత్త మార్పు చేసింది. దీని కింద అనర్హుల నుంచి డబ్బు వసూలు చేస్తారు. మీరు పీఎం కిసాన్ యోజనకి అర్హులు కాదని తెలిస్తే ఇప్పటి వరకు మీరు పొందిన ఇన్‌స్టాల్‌మెంట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నిజానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లక్షలాది మంది రైతులు నకిలీ పద్ధతిలో డబ్బులు తీసుకున్నారు.

చాలా మంది పన్ను చెల్లింపుదారులు కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇన్‌స్టాల్‌మెంట్లు పొందుతున్న కుటుంబాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ పథకం నిబంధనల ప్రకారం పొలాలు భార్యాభర్తల పేరిట ఉండాలి. కానీ వారు కలిసి జీవిస్తుంటే కుటుంబంలోని పిల్లలు మైనర్‌లైతే ఈ పథకం ప్రయోజనం ఒకరికి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు అలాంటి నకిలీ రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. వారికి నోటీసులు పంపనుంది. మీరు కూడా అలాంటి పొరపాటుకు పాల్పడినట్లయితే తప్పుగా తీసుకున్న మొత్తాన్ని స్వచ్ఛందంగా తిరిగి చెల్లించాలి. దీని కోసం ప్రభుత్వం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఒక సదుపాయాన్ని కల్పించింది. దీని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో డబ్బు వాపసు చేయవచ్చు. దాని ప్రక్రియను తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో డబ్బును ఎలా రీఫండ్ చేయాలి..?

1. https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి.

2. కుడివైపున ఉన్న బాక్స్ దిగువన, మీకు 'రీఫండ్ ఆన్‌లైన్' ఎంపిక వస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మీ ముందు రెండు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి.

4. ఇందులో మొదటి ఎంపిక- మీరు PM కిసాన్ డబ్బును తిరిగి ఇచ్చినట్లయితే మొదటిదాన్ని తనిఖీ చేసి ఓకె బటన్‌పై క్లిక్ చేయండి. లేకపోతే రెండో ఎంపికను తనిఖీ చేసి సమర్పించండి.

5. తర్వాత ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.

6. ఇప్పుడు ఇమేజ్ టెక్స్ట్ టైప్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయండి.

7. ఇందులో 'మీరు ఏ రీఫండ్ అమౌంట్‌కు అర్హులు కాద'ని మెసేజ్ వస్తుంది. లేకుంటే రీఫండ్ చూపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories