Dream11: 200 రూపాయలతో కోటి గెలిచాడు.. ఒక్క ఆటతో మారిన ప్లంబర్ జీవితం

* ఒక్క ఆట తన జీవితాన్నే మార్చేసింది.

Sandeep Reddy
Updated on: 14 Oct 2021 1:02 PM IST
Plumber Bablu Mandal Won one Crore Rupees in Dream 11 App
X

Dream 11: 200 రూపాయలతో కోటీ రూపాయలు గెలిచాడు..ఓ ప్లంబర్ జీవితాన్ని మార్చిన గేమ్

Dream 11: ఒక్క ఆట తన జీవితాన్నే మార్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు కావడమే ఆలస్యం బెట్టింగ్ లు వందల్లో నుండి కోట్లల్లో జరుగుతూనే ఉంటాయి. కాని ఆ డబ్బు గెలుచుకోనే అదృష్టం మాత్రం లక్షల్లో కొందరికి మాత్రమే తలుపుతడుతుంది. ఇప్పుడు ఆ అదృష్టం బీహార్ లోని ఒక మారుమూల గ్రామంలో ప్లంబర్ గా పని చేసే బబ్లూ మండల్ ని వరించింది.

బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలోని మనిహరి ప్రాంతానికి చెందిన బబ్లూ మండల్ హంసవర్ గ్రామంలో గత కొంతకాలంగా ప్లంబర్ గా పని చేస్తున్న ఇతడు ఈ మధ్యే తన స్నేహితుడి ద్వారా డ్రీమ్ 11 యాప్ గురించి తెలుసుకొని ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో 200 రూపాయలు బెట్టింగ్ పెట్టి కోటి రూపాయలను గెలుచుకున్నాడు.

ఈ సందర్భంగా బబ్లూ మండల్ మాట్లాడుతూ కోటీ రూపాయలు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకి వచ్చిన కోటి రూపాయలలో 30 లక్షల రూపాయలు టాక్స్ కట్ అయి 70 లక్షల రూపాయలు వచ్చాయని.., ఈ డబ్బుతో కొత్త ఇంటిని కట్టుకోవడమే కాకుండా కొంత డబ్బును దేవాలయానికి విరాళంగా ఇస్తానని చెప్పుకొచ్చాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story