Plasma Banks opens in Delhi : ప్లాస్మా దానం చేయండి: ఢిల్లీ సీఎం కేజ్రివాల్

Plasma Banks opens in Delhi : ప్లాస్మా దానం చేయండి: ఢిల్లీ సీఎం కేజ్రివాల్
x
Highlights

Plasma Banks opens in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి కోలుకున్న‌వారు ప్లాస్మా దానం చేయాల‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు.

Plasma Banks opens in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి కోలుకున్న‌వారు ప్లాస్మా దానం చేయాల‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజు ( గురువారం) ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోనే మొట్ట‌మొద‌టిది అయిన ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు ఇందులో కరోనా నుంచి కొలుకున్నవారు పాస్మా దానం చేయాల‌ని కోరారు. ఇక ప్లాస్మా దానం చేయాలని అనుకునేవారు 1031 నంబ‌ర్‌కు ఫోన్‌కాల్ ద్వారాగానీ, 8800007722 నంబ‌ర్ వాట్సాప్ మెసేజ్ ద్వారా గానీ స‌మాచారం అందించాలని కోరారు..

అయితే ప్లాస్మాను దానం చేయాలనుకునే వారి వ‌య‌సు 18 ఏండ్ల‌కు త‌గ్గ‌కుండా, 60 ఏండ్ల‌కు మించ‌కుండా ఉండాలని, బ‌రువు 50 కేజీల‌కు పైగా ఉండాల‌ని స్పష్టం చేశారు.. ఇక బాలింత‌లు, బీపీ, షుగ‌ర్ త‌దిత‌ర దీర్ఘ‌కాలిక రోగాలు ఉన్న‌వారు ప్లాస్మా దానానికి అర్హులు కాద‌న్నారు. ప్లాస్మా దానం చేయాల‌నుకునే వారు పై నంబర్స్ కి సమాచారం అందిస్తే డాక్ట‌ర్లు మిమ్మ‌ల్ని సంప్రదించి తదుపరి ధృవీక‌ర‌ణ చేస్తారని అర‌వింద్ కేజ్రివాల్ చెప్పుకొచ్చారు.

ఇక దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒక్కటి.. ఢిల్లీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. బుధవారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం ఢిల్లీలో కొత్తగా 2442 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89,802కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 27007 కాగా.. 59,992 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,29,588 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 90,56,173 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories