Petrol Diesel Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటోన్న ఇంధన ధరలు

Petrol Diesel Price Today: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 106.66 లు వుండగా, డీజిల్ ధర రూ.99.26 ల వద్ద కొనసాగుతోంది

Kranthi
Published on: 8 July 2021 10:52 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 08 07 2021
X

Petrol Diesel Price Today:(File Image)

Petrol Diesel Price Today: దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు.

కాని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొస్తున్నారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో సెంచరీని దాటేసింది. అదే బాటలో పయనిస్తోన్న డీజిల్ రూ.99కి ఎగబాకింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 100.56గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.59కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.18గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.100.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.65 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.37ఉండగా.. డీజిల్ ధర రూ.94.15గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.99 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.44 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.01గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.50గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.68గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 104.56గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.71గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.60గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.77గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.50ఉండగా.. డీజిల్ ధర రూ.97.68 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.05 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.25గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.106.37 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 99.26 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.105.47 ఉండగా.. డీజిల్ ధర రూ.98.16గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.52లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.50గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.90 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.15గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 106.66 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.26 ల వద్ద కొనసాగుతోంది.

Kranthi

Kranthi

Next Story