Petrol Diesel Price Today: భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు

Petrol Diesel Price Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.

Kranthi
Published on: 1 Jun 2021 7:13 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 01 06 2021
X

Petrol Diesel Price Today:(File Image)  

Petrol Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోతున్నాయి. ప్ర‌తీరోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. వంద దాటేసింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 94.23 గా ఉండ‌గా, డీజిల్ రూ. 85.15 వ‌ద్ద కొన‌సాగుతోంది. ముంబయిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.47 గా న‌మోదుకాగా, ఇక ఇక్క‌డ డీజిల్ కూడా పెట్రోల్‌తో పోటీ ప‌డీ మ‌రీ పెరుగుతోంది. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 92.45 ఉంది. చెన్నైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100.47 గా ఉండ‌గా, డీజిల్ రూ. 89.90 వ‌ద్ద కొన‌సాగుతోంది. బెంగ‌ళూరులో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 97.37 గా న‌మోదుకాగా, లీటర్ డీజిల్ ధ‌ర రూ. 90.27 వ‌ద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 97.93 గా ఉండ‌గా.., డీజిల్ ధ‌ర రూ. 92.83 వ‌ద్ద కొన‌సాగుతోంది. క‌రీంన‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.09 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 92.96 గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్ర‌లో ధ‌ర రూ. 100.35 గా ఉండ‌గా.. డీజిల్ రూ. 94.66 వ‌ద్ద కొన‌సాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో లీట‌ర్ పెట్రోల్ లీట‌ర్ రూ. 99.39 గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర రూ. 93.71 వ‌ద్ద కొన‌సాగుతోంది.

Kranthi

Kranthi

Next Story