Petrol, Diesel Rates Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోలు ధరలు

Petrol, Diesel Rates Today: స్థిరంగా కొనసాగుతోన్న పెట్రోలు ధరలు...కానీ తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప మార్పలు చోటు చేసుకున్నాయి.

Kranthi
Published on: 24 April 2021 6:54 AM IST
Petrol, Diesel Rates Today
X

Petrol, Diesel Rates Today

Petrol, Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలిలా.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది., ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా..

హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.26 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.27 గా ఉంది. కాగా.. కరీంనగర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.21 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.72 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.25 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.14 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.64 గా ఉంది.

Kranthi

Kranthi

Next Story