Petrol, Diesel price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol, Diesel price Today: దేశంలో పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Kranthi
Published on: 23 April 2021 6:55 AM IST
Petrol, Diesel price Today
X

Petrol, Diesel price Today:(File Image)

Petrol, Diesel price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు అన్నిచోట్ల స్థిరంగానే కొనసాగుతున్నాయి. క్రూడాయిల్ ధరలు భారీ పతనం అయినప్పటికీ మన దేశంలో ధరలు మాత్రం తగ్గడం లేదు. అదే క్రూడాయిల్ ధరలు ఏమాత్రం పెరిగినా దానికి రెట్టింపు ధరలు మన దేశంలో పెరుగుతాయి. మరి కారణాలు ఏమిటో తెలియదు.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.93.87 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.93గా ఉంది. కాగా.. కరీంనగర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.96 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.45 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.36 ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.92 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.56 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.90.03 గా ఉంది.

Kranthi

Kranthi

Next Story