Union Budget 2021: పెట్రో బాంబ్.. మరింత పెరగనున్న పెట్రోల్‌, డిజిల్ ధరలు

Union Budget 2021: పెట్రో బాంబ్.. మరింత పెరగనున్న పెట్రోల్‌, డిజిల్ ధరలు
x
Highlights

దేశంలో పెట్రో ధరలు ఇప్పటికే రికార్డ్‌ స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ఇన్ ఫ్రా సెస్ విధిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్...

దేశంలో పెట్రో ధరలు ఇప్పటికే రికార్డ్‌ స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ఇన్ ఫ్రా సెస్ విధిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జేట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అగ్రిసెస్‌ పేరుతో కేంద్రం మరింత భారం మోపింది. అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ పేరుతో పెట్రోల్‌పై రెండున్నర రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల మేర సెస్‌ విధించింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరగనున్నాయి లీటర్‌ పెట్రోలు రూ.100కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories