తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పండుగ

People Ready to Celebrate Rakhi Festival
x

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పండుగ

Highlights

Rakhi: సోదర, సోదరీమణుల అనురాగానికి ప్రతీక రాఖీ వేడుక

Rakhi: సోదర సోదరీమణుల అనురాగం... ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ.. అన్నా చెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల బంధాన్ని మరింత బలపరుచుకునేందుకు జరుపుకునే వేడుక రాఖీ. రాఖీలని నమ్ముకొని చాలా మంది హైదరాబాద్ లో ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అసలు రాఖీ పండుగ విశిష్టతేంటి ? నగరంలో ఎలాంటి రాఖీలు జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నగర జనం పండుగ ఎలా జరపుకుంటున్నారో ఓసారి చూద్దాం.. ?

అన్న,చెళ్లెల్లు... అక్క,తమ్ముళ్లు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. తోడబుట్టిన వారు జీవితాంతం తమకు అండగా ఉండాలని, ప్రతీ క్షణం రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు అన్నతముళ్లకు రాఖీ కడతారు. అంతటి పండుగను నగర జనం ఈ సారి ఘనంగా జరుపుకునేందుకు రెడీ అయ్యారు. సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు

అయితే ఈ రాఖీలు మార్కెట్‌లో ఒకటి,రెండు కాదు... లక్షల్లో, వేలల్లో వెరైటీలు ఉన్నాయి. ఏ వెరైటీ రాఖీ కావాలన్నా హైదరాబాద్‌లోని కోఠి సెంటర్‌కు వెళ్లాల్సిందే అంటున్నారు మహిళలు. 15 ఏళ్లుగా ఇక్కడి వారు రాఖీ వ్యాపారం చేస్తూ జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఏడాది పొడువునా హోల్‌సెల్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారు. అయితే గతేడాది కంటే ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.

గత 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన రాఖీల తయారీకి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, రాజకోట నుండి ముడి సరుకుని దిగుమతి చేసుకుంటామని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం సరుకు దిగుమతి తక్కువగా ఉందని.. అందుకే రేట్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు తయారీ దారులు. పండక్కి రెండు రోజుల ముందు నుండి ఎలాంటి లాభం లేకుండా రాఖీలు అమ్మడం ఇక్కడి ప్రత్యేకతని చెబుతున్నారు.

కరోనా కారణంగా గత రెండేళ్లు రాఖీ పండుగ జరుపుకోలేకపోయిన నగరం జనం ఈసారి ఘనంగా పండగ జరుపుకునేందుకు రెడీ అయ్యారు. ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories