వీడెవడండీ బాబూ అంటున్న కాంగ్రెస్ హైకమాండ్

People Have Voted for AAP for a Change Says Navjot Singh Sidhu
x

వీడెవడండీ బాబూ అంటున్న కాంగ్రెస్ హైకమాండ్

Highlights

Navjot Singh Sidhu: పంజాబ్ ఘోర పరాభవం తర్వాత అందరి దృష్టి సిద్ధూపైనే పడింది.

Navjot Singh Sidhu: పంజాబ్ ఘోర పరాభవం తర్వాత అందరి దృష్టి సిద్ధూపైనే పడింది. సిద్ధూ తీరు వల్లే కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని వర్షన్ పతాక శీర్షిక అయ్యింది. తాజాగా పంజాబ్ ఓటమి విషయంలోనూ చాలా చాలా ఆనందాన్ని వెదుక్కుంటున్నారు సిద్ధూ... పంజాబ్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారని మార్పుకు ఓటు వేసి మంచి పని చేశారంటూ మీడియాతో ముచ్చట్లు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉండి ఆప్ ను ఎలా పొగుతారని ప్రశ్నిస్తే నాకు నచ్చినట్టు నేను మాట్లాడతానంటూ మొత్తం ఓటమిని లైట్ తీసుకున్నారు సిద్ధూ.

మరోవైపు సిద్ధూ విషయంలో తలబొప్పి కట్టిన కాంగ్రెస్ హైకమాండ్ వదలిపించుకునేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయ్. సిద్ధూ తీరుతో విసిగిపోయిన పంజాబ్ నేతలు ఆయనను సాగనంపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధూని తప్పించాలంటూ చాలా మంది హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న CWC సమావేశంలో ఐదు రాష్ట్రాల ఓటమిపై పార్టీ చర్చించనుంది. ఇదే సమయంలో పంజాబ్ పీసీసీ చీఫ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories