ఎట్టకేలకు మాజీ సీఎం మెహబూబాకు విముక్తి

జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి ఎట్టకేలకు విముక్తి లభించింది. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పిఎస్ఎ) ను జమ్మూ కాశ్మీర్
జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి ఎట్టకేలకు విముక్తి లభించింది. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పిఎస్ఎ) ను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది, దీంతో దాదాపు 14 నెలలపాటు గృహ నిర్బంధంలో ఉన్న ఆమెకు కు విముక్తి లభించింది. తక్షణమే పిఎస్‌ఎను ఉపసంహరించాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించడంతో.. మంగళవారం రాత్రి మెహబూబా ముఫ్తీని విడుదల చేసినట్లు జమ్మూకశ్మీర్ అధికారులు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అల్లర్లు చెలరేగకుండా ఆ తరువాత ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇక తన తల్లి నిర్బంధంలో నుండి విడుదల కావడం పట్ల ఆమె కుమార్తె ఇల్టిజా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె తన ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు. 'ఈ కఠినమైన సమయాల్లో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' ఇల్టిజా అన్నారు. కాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఒక సంవత్సరానికి పైగా నిర్బంధంలో ఉన్న తరువాత మెహూబాను విడుదల చేసినట్లు విన్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT