Pawan Delhi Tour: అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..? జగన్ కోసం చంద్రబాబుకు చెక్ పెట్టేందుకే..

Pawan Kalyan Visit To Delhi
x

Pawan Delhi Tour: అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..? జగన్ కోసం చంద్రబాబుకు చెక్ పెట్టేందుకే..

Highlights

Pawan Kalyan: సీఎం జగన్ వెళ్లి వచ్చిన నాలుగు రోజులకే పవన్ హస్తిన టూర్

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో జనసేనాని భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన చర్చలు జరపనున్నారు. ఏపీలో గత కొంతకాలంగా బిజెపి, జనసేన మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, టిడిపితో కలిసి ఎన్నికల బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

కచ్చితంగా వారం రోజుల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షాతోనూ జగన్ చర్చలు జరిపారు. జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆయన ఢిల్లీ పర్యటనలు కూడా ముందస్తు వ్యూహంలో భాగమేననే చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో జనసేనాని హస్తినకు వెళ్లడం.. రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

పవన్ ఢిల్లీ టూర్ పై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపధ్యంలోనే పవన్.. బీజేపీ జాతీయ నేతలను కలిసి తన మనసులో మాటను చెప్పనున్నారని తెలుస్తోంది. జగన్ ఢిల్లీ టూర్ తర్వాత, పవన్ కల్యాణ్ ను.. బీజేపీనే ఢిల్లీకి పిలిపించుకుందా..? లేదంటే రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీతో వెళ్తున్నాని చెప్పడానికే ఢిల్లీ వెళ్లారా అనే చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ-జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేయాలని అమిత్ షా ఒత్తిడి చేస్తున్నారా..? జగన్ కోసం, చంద్రబాబుకు చెక్ పెట్టేందుకే బీజేపీPawan Delhi Tour: అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..? జగన్ కోసం చంద్రబాబుకు చెక్ పెట్టేందుకే.. నేతలు ఇదంతా చేస్తున్నారా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?

Show Full Article
Print Article
Next Story
More Stories