Pawan Kalyan: ఢిల్లీలో బిజీబిజీగా పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీలు

Dhatripriya
Published on: 4 April 2023 8:38 AM IST
Pawan Kalyan Is Busy In Delhi
X

Pawan Kalyan: ఢిల్లీలో బిజీబిజీగా పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: ఢిల్లీలో పవన్‌కల్యాణ్‌ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. బీజేపీ అగ్రనేతలతో వరుసగా పవన్ భేటీ అవుతున్నారు. నిన్న కేంద్రమంత్రి షెకావత్‌ను పవన్‌ కలిశారు. పోలవరం పూర్తికి కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ఇక నేడు అమిత్‌షా, నడ్డాను పవన్‌ కలిసే అవకాశముంది. టీడీపీ పొత్తుతో సహా అన్ని అంశాలపై క్లారిటీ కోసం మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. బీజేపీ, సంఘ్ పరివార్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న పవన్.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నారు.

బీజేపీ నేత మురళీధరన్‌తో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. బీజేపీ అభిమతం, ఎన్నికలకు సమాయత్తం, రాజకీయ కార్యాచరణపై జనసేన నేతలు స్పష్టత కోరినట్లు తెలుస్తుంది. పవన్‌తో చర్చల వివరాలను జేపీ నడ్డాకు అందించినట్లు సమాచారం. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న బీజేపీ నేతలు.. అవకాశాన్ని బట్టి పవన్‌తో సమావేశాలు జరుపుతున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story