TOP 6 NEWS @ 6PM: మాదిగ అని చెప్పుకునే గుండె ధైర్యం ఆయనది.. మంద కృష్ణమాదిగపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు


TOP 6 NEWS @ 6PM: మాదిగ అని చెప్పుకునే గుండె ధైర్యం ఆయనది.. మంద కృష్ణమాదిగపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
1) నోటిఫికేషన్స్ ఇచ్చింది మీరే... జీరాక్స్ షాపులలో ప్రశ్న పత్రాలు అమ్ముకుంది మీరే... గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆరోపణలు 20 నుండి 25 లక్షల మంది...
1) నోటిఫికేషన్స్ ఇచ్చింది మీరే... జీరాక్స్ షాపులలో ప్రశ్న పత్రాలు అమ్ముకుంది మీరే... గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆరోపణలు
20 నుండి 25 లక్షల మంది నిరుద్యోగులు, పట్టభద్రులు హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. "ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేసి సాధించున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం అవన్నింటిని గాలికొదిలేసింది. పదేళ్ల క్రితమే 20-25 ఏళ్ల వయస్సున్న వారు ఉద్యోగాల సాధన కోసం ఊర్లో కుటుంబాలను వదిలేసి హైదరాబాద్ బాటపట్టిర్రు కానీ వారి కలలు నెరవేరలేదు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక క్యాలెండర్ ఇయర్ ప్రకారం కొలువులను భర్తీ చేస్తూ వస్తోందన్నారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కొలువుల పండగలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
పదేళ్లలో గత ప్రభుత్వం చేయలేని పనిని పది నెలల్లో తమ ప్రభుత్వం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఖాళీలను భర్తీ చేయడంలో ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదేళ్లలో నోటిఫికేషన్స్ ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్స్‌లో కొన్ని కోర్టు కేసుల పాలయితే, ఇంకొన్నింటికి జీరాక్స్ షాపులలో ప్రశ్న పత్రాలు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
2) బెట్టింగ్ యాప్ కేసు: విజయ్ దేవరకొండ టీమ్ వివరణ
ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న వాటికే పనిచేశారని విజయ్ దేవరకొండ టీమ్ మీడియాకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ పనిచేస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. ఏ కంపెనీకి పనిచేసినా, అడ్వర్ టైజ్ మెంట్ లో పనిచేసినా ఆ సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది విజయ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆ టీమ్ వివరించింది.
ఏదైనా లేదా ఉత్పత్తి చట్టప్రకారం అనుమతి ఉందని తెలిసిన తర్వాతే విజయ్ దేవరకొండ వాటికి ప్రచారకర్తగా ఉంటారని చెప్పారు. ఇలాంటి అనుమతులున్నాయని తెలిసిన తర్వాత ఏ23 సంస్థ బ్రాండ్ కు విజయ్ అంబాసిడర్ గా పనిచేసినట్టు ఆయన టీమ్ వివరించింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ తో ఒప్పందం గత ఏడాదితో ముగిసిన విషయాన్ని విజయ్ దేవరకొండ టీమ్ గుర్తు చేసింది. ఈ సంస్థతో విజయ్ దేవరకొండకు సంబంధం లేదని తెలిపింది. మీడియాలో ప్రసారమౌతున్నట్టు నిబంధలకు విరుద్దంగా పనిచేస్తున్న ఏ సంస్థకు ఆయన ప్రచారకర్తగా ఆయన వ్యవహరించలేదని విజయ్ దేవరకొండ టీమ్ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) మంద కృష్ణ మాదిగపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగను అభినందించారు. "అన్ని కూలాల వారు తమ కులం పేరు చెప్పుకుంటారు. కానీ తను మాదిగ అని చెప్పుకునే పరిస్థితి లేని రోజుల్లోనే మంద కృష్ణ మాదిగ తన పేరు చివర్లో మాదిగ అని చెప్పుకున్నారు. మాదిగ కులం ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన గుండె ధైర్యం ఆయన సొంతం" అని పవన్ కళ్యాణ్ అన్నారు. మాదిగ కులానికి ఆత్మగౌరవం, వన్నె తెచ్చిన నాయకుడు ఆయన అని ప్రశంసల్లో ముంచెత్తారు.
ఎస్సీ వర్గీకరణ పోరు ఇక్కడి వరకు తీసుకురావడంలో మంద కృష్ణ మాదిగ పాత్ర చాలా కీలకం అని చెబుతూ ఈ అసెంబ్లీ సాక్షిగా ఆయన్ను అభినందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
4) Miss World 2025 pageant in Hyderabad: అందాల పోటీల చరిత్ర తెలుసా?
మిస్ వరల్డ్ 2025 పోటీలను 2025 మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు 140 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.మహిళల ఆత్మ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశమని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యాటక అందాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను కూడా ఈ పోటీల్లో పాల్గొనేవారు సందర్శిస్తారు.రామప్ప, బుద్దవనం, భూధాన్ పోచంపల్లి, కుంటల జలపాతం, ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్, కాళేశ్వరం, వేములవాడ, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు గ్రూపులుగా విభజించి పోటీదారులను తీసుకెళ్తారు. తెలంగాణ గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇది ఒక అవకాశమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల్లో ఇండియా, అమెరికా, బ్రిటన్ ర్యాంక్స్ ఎంతో తెలుసా?
World's happiest countries list 2025: ప్రపంచంలో ఏయే దేశాలు ఎక్కువ సంతోషంగా ఉన్నాయో, ఏయే దేశాలు సంతోషంగా లేవో చెప్పే నివేదిక వచ్చేసింది. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2025 గురువారం విడుదలైంది. ఆ రిపోర్ట్ ప్రకారం సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఫిన్‌ల్యాండ్ నెంబర్ 1 స్థానంలో ఉంది.
ఇలా ఫిన్‌ల్యాండ్ ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకోవడం వరుసగా ఇది 8వ ఏడాది. అంతేకాదు... మొదటి నాలుగు దేశాల జాబితాలో ఎప్పటిలాగే ఫిన్ ల్యాండ్ తరువాత డెన్మార్క్, ఐస్ లాండ్, స్విడెన్ దేశాలు ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని వెల్ బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ఈ వివరాలను వెల్లడిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) 2008 నాటి రిసెషన్ మళ్లీ వస్తుందా? అందుకు ఇదే సంకేతమా?
Recession fears in US: అమెరికాలో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు చూస్తోంటే, 2008 నాటి ఆర్థిక మాంద్యం మళ్లీ రానుందా అనే భయాందోళనలకు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో లోన్స్ తీసుకున్న వారు ఇటీవల కాలంలో వాటిని చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంన్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ లోన్స్ తీసుకున్న వారిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఫిచ్ రేటింగ్స్ డేటాను విశ్లేషిస్తే... తక్కువ క్రెడిట్ స్కోర్ తో సబ్ ప్రైమ్ ఆటో లోన్స్ తీసుకున్న వారిలో 6.6 శాతం రుణగ్రహీతలు ఆ లోన్స్ ను తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐ చెల్లించాల్సిన డ్యూడేట్ కంటే కనీసం 60 రోజులు వెనుకబడి ఉన్నారని డైలీ మెయిల్ వార్తా కథనం పేర్కొంది.
అమెరికన్ మీడియా వార్తా కథనం ప్రకారం 2008 లో ఆర్ధిక మాంద్యం వచ్చినప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పట్లో కూడా సబ్ ప్రైమ్ మార్ట్ గేజ్ లోన్స్ తీసుకున్న వారు చాలామంది డీఫాల్టర్స్ లా మిగిలిపోయారు. దీంతో ఈ ట్రెండ్ చూస్తోంటే అమెరికాలో మరోసారి హిస్టరీ రిపీట్ అవుతుందా అని అక్కడి బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే చాలామంది రుణగ్రహీతలు లోన్ ఇఎంఐలు చెల్లించకుండా ఆ డబ్బుతో రోజువారి కనీస అవసరాలు, తప్పనిసరి చెల్లింపులు మాత్రమే చెల్లిస్తూ ఇఎంఐలను వాయిదా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



