అంబులెన్స్‌లో క్షతగాత్రుడు.. ఆస్పత్రికి చేరాక తెరుచుకోని డోర్స్..

Patient Dies After Ambulance Door Fails to Open in Kerala
x

అంబులెన్స్‌లో క్షతగాత్రుడు.. ఆస్పత్రికి చేరాక తెరుచుకోని డోర్స్..

Highlights

Kerala: అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడం వల్ల ఓ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది.

Kerala: అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడం వల్ల ఓ వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ దురదృష్టకరమైన సంఘటన కేరళలో జరిగింది. కేరళలోని ఫెరోక్‌కు చెందిన 66 ఏళ్ల కోయమోన్‌కి బైక్‌ యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ వ్యక్తి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. వెనువెంటనే అంబులెన్స్‌ వచ్చి నిర్ణిత సమయానికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌కి తీసుకువచ్చింది కూడా. వేగంగా ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ.. అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. అంబులెన్స్ సిబ్బంది, బాధితుడి బంధువులు అరగంటకుపైగా సుత్తితో కొట్టినా అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. చివరికి డోర్‌కు ఉండే అద్దాలు పగలుగొట్టి లోపలి నుంచి డోర్‌లు ఓపెన్‌ చేశారు. అప్పటికే క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories