Budget Meeting 2022: బడ్జెట్‌ సమావేశాలు షురూ

Budget Meeting 2022: సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ మూలసూత్రంతో... కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్న రామ్‌నాథ్‌ కోవింద్‌

Rama Rao
Published on: 31 Jan 2022 1:11 PM IST
Parliamentary Budget Meetings Start | National News Today
X

 బడ్జెట్‌ సమావేశాలు షురూ

Budget Meeting 2022: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉబయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద‌ ప్రసంగించారు. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ అనే మూల సూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్రపతి చెప్పారు.

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ భాతర్‌ ప్రపంచ రికార్డు సృష్టించిందని రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. ఇప్పటికే 70 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయిందన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్లను తయారు చేస్తున్న రెండో దేశంగా భారత్‌ అని కితాబిచ్చారు. కరోనా మహమ్మారిపై పోరాటం స్పూర్తి దాయకమని తెలిపారు.

ప్రతి భారతీయుడికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వాతంత్ర అమృత్‌ మహోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. సభకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఉబయ సభల సభ్యులు హాజరయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story