Parliament Monsoon Session: ఉభయసభలను కుదుపేసిన పెగాసస్‌ ఎపిసోడ్‌

Parliament Monsoon Session Lok Sabha Adjourned Until July 22
x

Parliament Monsoon Session: ఉభయసభలను కుదుపేసిన పెగాసస్‌ ఎపిసోడ్‌

Highlights

Parliament Monsoon Session: పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు రోజూ కూడా అవే సీన్స్ విపక్షాల నిరసనలు మంత్రుల రిక్వెస్ట్‌లతో సాగిపోయింది.

Parliament Monsoon Session: పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు రోజూ కూడా అవే సీన్స్ విపక్షాల నిరసనలు మంత్రుల రిక్వెస్ట్‌లతో సాగిపోయింది. ఉభయసభలను పెగాసస్‌ ఎపిసోడ్‌ కుదుపేసింది. ఫోన్ల హ్యాకింగ్‌పై దర్యాప్తు జరగాల్సిందే అంటూ విపక్షాలు మొండికేశాయి. మరోవైపు రాజ్యసభ మొదలవ్వగానే స్పెషల్‌ స్టేటస్‌ కోసం వైసీపీ ఎంపీలు పట్టుసడలకుండా కంటిన్యూగా నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ వాయిదాలకే పరిమితమైంది.

ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. పెగాసస్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెనక్కితగ్గలేదు. దీంతో రెండోరోజు పార్లమెంట్‌ సమావేశాలు నిరసనలతోనే గడిచిపోయాయి. పెగాసస్ ఎపిసోడ్ పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. ఫోన్ల హ్యాకింగ్‌పై చర్చించాలని సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు మొండికేశాయి. అటు పెగాసస్‌తో మాకేంటి సంబంధం అంటూ అధికార పార్టీ ప్రశ్నించింది.

రాజ్యసభలో వైసీపీ ఎంపీలు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. ఏపీ స్పెషల్‌ స్టేటస్‌, స్టీల్‌ప్లాంట్‌, పోలవరంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. రూల్‌ 267 కింద నోటీసులిచ్చిన వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఒకపక్క కోవిడ్‌పై చర్చ జరుగుతుండగా నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ఎంపీల నిరసనల కారణంగా కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అయితే సహకరించాలంటూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ విజ్ఞప్తి చేసినా వైసీపీ ఎంపీలు వినుపించుకోకపోవడంతో సభను రెండోసారి వాయిదా వేయక తప్పలేదు.

ప్రత్యేక హోదా హామీపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి పట్టుపట్టారు. మరోవైపు లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చారు ఎంపీ మార్గాని భరత్‌ సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి తక్షణమే చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌‌ను ఆయన కోరారు.

అంతకుముందు రాజ్యసభలో కోవిడ్‌పై ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు మోడీ ప్రయత్నించారు. అయితే ప్రధాని ప్రజంటేషన్ కంటే ముందే చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. కోవిడ్‌పై ప్రెజెంటేషన్ ఇవ్వాలని మోదీ అనుకుంటే ప్రత్యేకంగా సెంట్రల్ హాలులో ఇచ్చుకోవచ్చని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్షాల డిమాండ్‌కు రాజ్యసభ ఛైర్మన్‌ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో కోవిడ్‌పై రాజ్యసభలో చర్చించారు. కానీ వైసీపీ ఎంపీల నిరసనలతో కొంత అంతరాయం ఏర్పడింది.

లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనలతో ఉదయం నుంచి వరుసగా లోక్‌సభ వాయిదా పడుతూ వచ్చింది. ఇక రేపు బక్రీద్‌ కావడంతో పార్లమెంట్‌కు సెలవు ప్రకటించారు. పలు పార్టీల నిరసనలతో పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ సజావుగా సాగడం కష్టమేనా..? అన్న ప్రశ్నలు అధికార, విపక్షాలతో పాటు ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు రోజుల సమయం దాదాపు వృధా అయిన నేపథ్యంలో ఇరుపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అని ఉత్కంఠను కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories