పద్మ విభూషణ్ ని వెనక్కి ఇచ్చేసిన పంజాబ్ మాజీ సీఎం!

పద్మ విభూషణ్ ని వెనక్కి ఇచ్చేసిన పంజాబ్ మాజీ సీఎం!
x
Highlights

ఢిల్లీలో రైతుల నిరసనలకు సంఘీభావంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టుగా ప్రకటించారు

ఢిల్లీలో రైతుల నిరసనలకు సంఘీభావంగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కేంద్రం ఆయనకు 2015లో ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఎనమిది రోజులుగా అన్నదాతలు ఆందోళన చేప్పట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం రైతులతో మరోసారి చర్చలు ప్రారంభించింది. 40 మంది రైతు సంఘాల నేతలతో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, పియూష్ ఘోషల్ సమావేశం అయ్యారు.

అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళా : పంజాబ్ సీఎం

వ్యవసాయ చట్టాల పైన రైతుల అభ్యంతరాలతో ఆటు తన వ్యతిరేకతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టుగా పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ వెల్లడించారు. సమస్యకు పరిష్కారం తమకి తెలియదని, కేంద్రం ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపించాలని కోరినట్టిగా అమరిందర్ సింగ్ తెలిపారు. కేంద్రమంత్రులు, రైతుల మధ్య ఈ జరుగుతున్న చర్చలు విజయం సాధించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories