Tamil Nadu Election 2021: తమిళనాడులో నామినేషన్ల సందడి

Tamil Nadu Election 2021: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తమిళనాడులో నామినేషన్ల సందడి నెలకొంది.

Arun Chilukuri
Published on: 15 March 2021 6:17 PM IST
Palaniswami, MK Stalin, TTV Dhinakaran, Kamal Hassan, Nominations
X

తమిళనాడులో నామినేషన్ల సందడి

Tamil Nadu Election 2021: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తమిళనాడులో నామినేషన్ల సందడి నెలకొంది. ఆరాష్ట్ర సీఎం పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి నామినేషన్‌ వేశారు. ఎడప్పాడి నుంచి పళని 1989, 1991, 2011, 2016 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించారు.

అటు డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్‌ కూడా నామినేషన్‌ వేశారు. వరుసగా మూడోసారి ఆయన కొలతూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. నామినేషన్‌ అనంతరం స్టాలిన్‌ భారీ రోడ్‌ షో నిర్వహించారు.

ఇక AMMK పార్టీ ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కోవిల్‌పట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దినకరన్‌ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మక్కల్‌ నీధి మయ్యిం పార్టీ చీఫ్‌ కమల్‌ హాసన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కోయంబత్తూర్ సౌత్‌ నియోజకవర్గం నుంచి కమల్‌ పోటీలోకి దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story