భారత గగనతంలోకి పాక్ డ్రోన్

భారత గగనతంలోకి పాక్ డ్రోన్
x
Highlights

భారత్ పై పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇటీవలి కాలంలో భారత్ గగనతలంలోకి పాక్ సంబంధించిన డ్రోన్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

భారత్ పై పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇటీవలి కాలంలో భారత్ గగనతలంలోకి పాక్ సంబంధించిన డ్రోన్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి పాకిస్థాన్ కు చెందిన డ్రోన్లు పంజాబ్‌లో- పాక్‌ సరిహద్దుల్లో చక్కర్లు కొడుతూ కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు.

పంజాబ్‌లోని హజారాసింగ్‌ వాలా, బక్డీ ప్రాంతంలో పాక్‌ డ్రోన్‌ ఒకటి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. బీఎస్‌ఎఫ్‌ అధికారులు కూడా పంట పొలాల మీదుగా దాదాపు కిలోమీటరు వరకు డ్రోన్‌ దూసుకొచ్చిందని వెల్లడించారు. అది వచ్చిన కాసేపటికే కనిపించకుండా పోయిందని వివరించారు. పాకిస్థాన్ తన డ్రోన్‎ను భారత భూభాగంలోకి జారవిడిచిందా అనే సంగతి తెలుసుకోవడానికి బీఎస్ఎఫ్ (బోర్దర్ సెక్కూరిటీ ఫోర్స్) కనుగొనే ప్రయత్నంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories