India vs Pakistan: పాక్‌పై దాడులకు ప్లాన్‌ రెడీ.. ఇండియా చేసేది ఇదే!

India vs Pakistan
x

India vs Pakistan: పాక్‌పై దాడులకు ప్లాన్‌ రెడీ.. ఇండియా చేసేది ఇదే!

Highlights

India vs Pakistan: ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం జరగకపోయినా, యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశం మాత్రం బలంగా ఉంది.

India vs Pakistan: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాన్ని ప్రధానంగా గమనిస్తున్నాయి. భారత్ దృష్టిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కేవలం వివాదిత ప్రాంతమే కాక, ఉగ్రవాద శిబిరాలకు ఆధారంగా మారిన స్థలం కూడా. అదే కారణంగా భారత సైన్యం ఈ ప్రాంతంపై దాడికి సిద్ధమవుతోందన్న ప్రచారం ఊపందుకుంది.

ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న మదరసాలు, శిక్షణ కేంద్రాలు మొదటి లక్ష్యాలుగా మారనున్నాయన్న వార్తలు వస్తున్నాయి. పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదులు ఇదే ప్రాంతాల నుంచి భారత్‌లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత భద్రతా సంస్థలు ఇప్పటికే ఆచూకీలు సేకరిస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు పాక్ కూడా ఈ ప్రాంతాల్లో తన సైన్యాన్ని మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఇతివరకు పాక్ తన ఆధీనంలోని అజాద్ కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్‌లను స్వతంత్రంగా ప్రాజెక్ట్ చేస్తూ వచ్చినా, వాస్తవానికి ఆ పరిపాలన అంతా ఇస్లామాబాద్ చేతుల్లోనే ఉండటం, ప్రజాస్వామ్య పరమైన స్వేచ్ఛలు లేవన్న ఆరోపణలు స్థిరంగా ఉన్నాయి. గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు వ్యూహాత్మకంగా చాలా కీలకంగా ఉండటంతో, పాక్ వాటిని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించేందుకు పావులు కదుపుతోంది. భారత్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇలాంటి సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడంతో, భారత్ ప్రతీకార మూడ్‌లో ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీకార చర్యల భాగంగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశముంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు కూడా సరిహద్దు వద్ద నెలకొన్న పరిణామాలపై తీవ్ర శ్రద్ధ పెట్టినట్టుగా కనిపిస్తోంది. POKపై భారత్ సైనిక చర్య చేపడితే, అది కేవలం ఆ ప్రాంతపు భద్రత పరమైన ప్రాధాన్యత మాత్రమే కాదు, రాజకీయంగా కూడా పాక్‌పై భారీ ఒత్తిడిగా మారే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories