డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తున్న ఉగ్రవాదులు

డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తున్న ఉగ్రవాదులు
x
Highlights

కాశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నాయని గుర్తించిన పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు.. ఆయుధాల సరఫరాకు తెలివైన మార్గాలను..

కాశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నాయని గుర్తించిన పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు.. ఆయుధాల సరఫరాకు తెలివైన మార్గాలను ఎంచుకుంటున్నాయి. పలు ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోకి ఆయుధాలను పంపడం ప్రారంభించాయి. శుక్రవారం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముగ్గురు కాశ్మీరీ వ్యాలీకి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారివద్దనుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు డ్రోన్ల ద్వారా తరలించినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో

రెండు ఎకె -56 రైఫిల్స్, ఆరు ఎకె మ్యాగజైన్, 3 పిస్టల్స్ ,‌ 2 చైనీస్ పిస్టల్స్, 4 గ్రెనేడ్లు, రెండు వ్యలెట్లు ఉన్నాయి. ఇక నిందితులను పుల్వామాకు చెందిన రాహిల్ బషీర్, అమీర్ జాన్ అలియాస్ హమ్జాగా గుర్తించగా, హఫీజ్ యూనస్ వాని షోపియన్‌కు చెందినవాడు. ముగ్గురు నిందితుల నుంచి లక్ష లక్ష నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ల ద్వారా ఆయుధాలు సరఫరా అవుతుండటంతో సరిహద్దుల వద్ద బిఎస్ఎఫ్ హై అలర్ట్‌లో ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎనిమిది సార్లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories