పాకిస్థాన్ పెద్ద కుట్ర? ఉగ్రనేత మసూద్ అజార్ విడుదల!

పాకిస్థాన్ పెద్ద కుట్ర? ఉగ్రనేత మసూద్ అజార్  విడుదల!
x
Highlights

పాకిస్థాన్ భారత్ పై ఉగ్ర కుట్రకు తెరతీసినట్టు సమాచారం అందుతోంది. అంతర్జాతీయ సమాజానికి గతంలో తాను అరెస్ట్ చేసినట్టు చెప్పిన జైషే అహ్మద్ నేత ఉగ్ర నాయకుడు మసూద్ అజార్ ను రహస్యంగా విడుదల చేసిందని చెబుతున్నారు.

అంతర్జాతీయ వేదికలపై భంగపాటుతో రగిలిపోతున్న పాకిస్థాన్ భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాశ్మీర్ విషయంలో భారత్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు ఉగ్ర కుట్రకు పాల్పడబోతున్నట్టు కనిపిస్తోంది. దీనికోసం జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజా ర్ ను వాడుకున్తున్నట్టు ఐబీ అనుమానిస్తోంది. కొన్ని రోజుల క్రితం మసూద్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పాకిస్తాన్ అతనిని రహస్యంగా విడుదల చేసిందని భారత ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) కి సమాచారం అందింది. దీంతో ఆ సంస్థ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

రాజస్థాన్‌ సమీపంలో ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద పాక్‌ పెద్ద కుట్రకు పావులు కదుపుతోందని ఐబీ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.ఐబీకి చెందిన ఇద్దరు అధికారులు చెప్పినట్లు అందుతున్న సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌-కళ్ళీర్‌ సెక్టార్లలో పెద్ద కుట్రకు పాక్‌ ప్రయత్నిస్తోంది. జమ్మూకళ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్జికల్‌ 370 రద్దు చేయడంపై పాక్‌ మరోసారి అడ్డదారి తొక్కనుంది. ఈ మేరకు రాజస్థాన్‌ సరిహద్దుల్లో భారీ స్థాయిలో ఆర్మీని మోహరించినట్లు జమ్మూ, రాజస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న భారత భద్రతా దళానికి సమాచారం అందింది. రెండు రోజుల క్రితం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌కు ధీటైన సమాధానం ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను రహస్యంగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలకు దిశానిర్దేశం చేయడానికే ఇతడిని వదిలి పెట్టినట్లు ఐబీ తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories