మోదీని కాదని.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పాక్ ఆహ్వానం !

మోదీని కాదని.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పాక్ ఆహ్వానం !
x
Highlights

పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పంపనుంది.

పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పంపానుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునట్లుగా ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌లో దర్బార్‌ సాహెబ్‌ గురుద్వార్, భారత దేశంలోని డేరా బాబా నానక్‌ గురుద్వారాలను కలుపుకొని ప్రత్యేక కారిడార్‌ను భారత్‌,పాక్‌ నిర్మిస్తుంది. ప్రస్తుత భారత ప్రధాని మోదీని కాదని ఈ నిర్ణయం తీసుకోవడంపై వివాదాస్పదమైంది. అయితే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పాకిస్థాన్ కు ఎంతో ప్రతిష్టాత్మకం కూడా. అధికారికంగా ఆహ్వాన పత్రిక అందజేస్తామని ఖురేషీ తెలిపారు. నవంబర్ 9, 2019న కారిడార్‌ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories