Gujarat: గుజరాత్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత

Gujarat: రూ.280 కోట్ల విలువైన డ్రగ్స్ బోటు సీజ్

Rama Rao
Published on: 25 April 2022 11:05 AM IST
Pakistan Boat with 9 People Apprehended Near Gujarat Coast, Heroin Worth Rs 280 cr Seized
X

Gujarat: గుజరాత్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత

Gujarat: గుజరాత్‌ తీరంలో భారీగా హెరాయిన్‌ను అధికారులు గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పడవలో తరలిస్తున్న 280 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఈ ఫిషింగ్ బోట్‌లో ఉన్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పాకిస్తాన్ బోట్ 'అల్ హజ్'ను పట్టుకున్నారు. విచారణ నిమిత్తం కచ్ జిల్లాలోని జఖావు తీరానికి పాకిస్థాన్ పడవతో పాటు నిందితులను తీసుకొచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story