Top
logo

టీవీ, ఫ్రిజ్‌, బైక్‌ ఉంటే రేషన్‌ కట్‌..

టీవీ, ఫ్రిజ్‌, బైక్‌ ఉంటే రేషన్‌ కట్‌..
X

టీవీ, ఫ్రిజ్‌, బైక్‌ ఉంటే రేషన్‌ కట్‌..

Highlights

మీ ఇంట్లో టీవీ, ఫ‌్రిజ్‌లున్నాయా..? తిరగడానికి బైక్‌ ఉందా..? అయితే మీ రేషన్‌ కార్డ్‌ కట్.‌ ఈ వివరాలన్నీ చెప్పి ...

మీ ఇంట్లో టీవీ, ఫ‌్రిజ్‌లున్నాయా..? తిరగడానికి బైక్‌ ఉందా..? అయితే మీ రేషన్‌ కార్డ్‌ కట్.‌ ఈ వివరాలన్నీ చెప్పి రేషన్‌ కార్డులు రద్దు చేసుకోకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం వార్నింగ్‌ ఇచ్చింది. కంగారు పడుతున్నారా...ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు...పక్కనున్న కర్నాటకలో. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, బైక్‌ ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకునేందుకు అర్హులు కాదని కర్నాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా కూడా రేషన్‌కు అర్హులు కాదు. వీరంతా మార్చి 31లోగా కార్డులు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని ప్రజాపంపిణీ శాఖ మంత్రి వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

Web TitleOwn a TV or fridge or 2 wheeler in Karnataka? Surrender your BPL card or face action
Next Story