Operation Sindoor: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. సెలవులు రద్దు, స్కూల్స్ మూసివేత, ఆ ప్రాంతాల్లో హై అలర్ట్

Operation Sindoor Leaves Cancelled Schools Shut Amid High Alert in Punjab Rajasthan
x

కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. సెలవులు రద్దు, స్కూల్స్ మూసివేత, ఆ ప్రాంతాల్లో హై అలర్ట్

Highlights

Operation Sindoor: రాజస్థాన్‌-పంజాబ్ సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్‌‌తో పంచుకున్న పంజాబ్ 532 కి.మీల సరిహద్దు , రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేర పాక్‌ సరిహద్దును సీల్‌ వేశారు.

Operation Sindoor: రాజస్థాన్‌-పంజాబ్ సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్‌‌తో పంచుకున్న పంజాబ్ 532 కి.మీల సరిహద్దు , రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేర పాక్‌ సరిహద్దును సీల్‌ వేశారు. సరిహద్దుప్రాంతాల్లోని విమానాశ్రయాలు బంద్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌' తర్వాత భారత్ అప్రమత్తమైంది. పాకిస్థాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఏ తరహా పరిస్థితి ఎదురైనా దీటుగా బదులిచ్చేందుకు భద్రతా చర్యలు చేపట్టారు. సరిహద్దులో అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. భారత్​ వాయుసేన పూర్తిగా అప్రమత్తవమైంది. పాకిస్థాన్​సరిహద్దు రాష్ట్రాల్లో విమానాశ్రయాల మూసివేతకు చర్యలు తీసుకున్నారు.

గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ పెంచారు. మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థల యాక్టివేట్‌ చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతలకు తగ్గట్టుగా - సరిహద్దుజిల్లాలో పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాలు ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్స తర్న్ తరన్ లతో విద్యాసంస్థలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్రిక్తత సమయంలో పంజాబ్ ప్రభుత్వ పాత్ర కీలకంగా మారింది. సరిహద్దుకు సమీప జిల్లాల అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ కార్యక్రమాల రద్దు చేసింది.

పంజాబ్ పోలీసులు కూడా రెండవ శ్రేణి రక్షణ వ్యవస్థగా సిద్ధమయ్యారు. పాకిస్థాన్‌కు దీటుగా స్పందించడానికి సైన్యంతో పంజాబ్ పోలీసులు రెడీ అయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా మే 10 వరకు ఉత్తర, వాయవ్య రాష్ట్రాల్లోని 21కి పైగా విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది. రాజస్థాన్​లోని జోధ్‌పుర్‌, బికనేర్‌, కిషన్‌ఘర్‌ విమానాశ్రయాలను మూసివేశారు. ఇక చర్యల్లో భాగంగా అమృత్ సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ అంతటా హై అలర్ట్ ఉందనీ, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమిగూడకూడదని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు అధికారులకు అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్టు తెలిపారు. తక్షణమే సిబ్బంది విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories