Ganga River: గంగా నదిలో కొనసాగుతున్న మృతదేహాల కలకలం

Ganga River: కన్నౌజ్‌లోని మహాదేవి ఘాట్ దగ్గర కనిపించిన 50 మృతదేహాలు * విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు

Sandeep Eggoju
Published on: 16 May 2021 4:58 PM IST
Ongoing Dead Bodies Issue in Ganga River at UP And Bihar
X

గంగ నదిలో మృతదేహాల కలకలం (ఫైల్ ఇమేజ్)

Ganga River: బీహార్, యూపీ గంగా తీరంలో మృతదేహాల కలకలం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా గంగా నదిలో భారీ సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. తాజాగా.. కన్నౌజ్‌లోని మహాదేవి ఘాట్ దగ్గర 50 మృతదేహాలను గుర్తించారు. అదేసమయంలో దేవరఖ్ ఘాట్ దగ్గర కూడా పెద్ద సంఖ్యలో డెడ్‌బాడీస్ పూడ్చిన ఆనవాళ్లు వెల్లడయ్యాయి. అయితే.. ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో సమాధులు ఉండడంతో అవి కొవిడ్ మృతులవే అయ్యుంటాయని భావిస్తున్నారు. గంగానదిలో మరోసారి మృతదేహాల కలకలం రేగడంతో విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడ్రోజుల్లో నివేదిక రూపొందించనుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story