Tirumala-Ayodhya: ప్రాణప్రతిష్ఠ వేడుక.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు

Tirumala-Ayodhya: ఈనెల 21 అయోధ్యకు చేరనున్న శ్రీవారి లక్షా లడ్డులు

Shekhar G
Published on: 18 Jan 2024 5:46 PM IST
One Lakh Tirupati Laddu Prasadam To Ayodhya Ram Mandir
X

Tirumala-Ayodhya: ప్రాణప్రతిష్ఠ వేడుక.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు

Tirumala-Ayodhya: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ పంపనుంది . మరో మూడ్రోజుల్లో జరగనున్న ఈ మహత్తరమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు‌..శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో తిరుమలలోని బూందీపొటులో 25గ్రాముల బరువుతో లక్ష లడ్డూలు తయారీని పొటు కార్మికులు ప్రారంభించారు. లడ్డూలను అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళా శ్రీవారి సేవకులు రామ నామాన్ని, గోవింద నామాలను స్మరిస్తూ ఒక్కో లడ్డూను ప్యాక్ చేస్తున్నారు....ఐదు రోజులపాటు లడ్డులు తాజాగా ఉండేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 21న లక్ష లడ్డూలు అయోధ్యకు చేరేలా టీటీడీ విమానంలో పంపనుంది.

Shekhar G

Shekhar G

Next Story