భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్.. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు..
Omicron Cases in India: ఇప్పటివరకు దేశంలో 101 ఒమిక్రాన్ కేసులు నమోదు...
భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్.. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు..
Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 101 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉందని స్పష్టం చేసింది.
అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు ఉండగా.. ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటక, తెలంగాణలో 8 కేసులు చొప్పున, గుజరాత్, కేరళలో 5 కేసులు చొప్పున రికార్డయ్యాయంది. అలాగే.. ఏపీ, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో కేసు వెలుగుచూశాయంది కేంద్ర వైద్యారోగ్యశాఖ. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, కొత్త వేరియంట్ కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
Next Story




