Old Man Cycle Ride in Tamilnadu: సర్టిఫికెట్ కోసం 70 కిమీ సైకిల్ తొక్కిన 73 ఏళ్ల వృద్ధుడు!

Old Man Cycle Ride in Tamilnadu: సర్టిఫికెట్ కోసం 70 కిమీ సైకిల్ తొక్కిన 73 ఏళ్ల వృద్ధుడు!
x
Highlights

Old Man Cycle Ride in Tamilnadu: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో చాలా మంది బతుకులు రోడ్డుమీదా పడ్డాయి.

Old Man Cycle Ride in Tamilnadu: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో చాలా మంది బతుకులు రోడ్డుమీదా పడ్డాయి.. ఉపాధి కోల్పోయి చాలా మంది బిక్కుబిక్కుమంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వలస కూలీలు పరిస్థితి అయితే దారుణంగా తయారైంది.. తాజాగా తమిళనాడు లోని ఓ 73 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ సాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి జిల్లా కలెక్టర్‌కు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.. తన బాధను విన్న అక్కడి సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు..

తంజావూర్‌ జిల్లా ఏనానల్లూర్‌కు చెందిన నటేశన్‌ (73) అనే 73 ఏళ్ల వృద్ధుడు వ్యవసాయ కూలీగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు..పని లేని సమయంలో ముగ్గు పిండి అమ్మేవాడు.. తాజాగా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోవడంతో తనకు దివ్యాంగుల కోటాలో సాయం అధించాలని స్థానిక అధికారుల చుట్టూ తిరిగేవాడు.. అయితే దానికి గాను వైద్య అధికారి నుంచి సర్టిఫికెట్ తేవాలని అధికారులు సూచించారు.

దీనితో రవాణా సదుపాయం సరిగా లేకపోవడంతో ఆ వృద్ధుడు పొద్దున మూడు గంటల సమయంలో బయలుదేరి 11 గంటలకు తంజావూరులోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. కలెక్టరేట్ కార్యాలయంలో భద్రతా విధుల్లో ఉన్న ఎస్ఐ సుకుమార్ జోక్యం చేసుకొని నటేశన్ ను కలెక్టరేట్ కార్యాలయంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖాధికారి వద్దకు తీసుకెళ్లారు...అక్కడ అధికారులకి తాన ఆవేదనని వ్యక్తం చేశాడు.. దీనిపైనే అధికారులు స్పందించి అతనికి కొద్దీ సమయంలోనే అతనికి కావాల్సిన ధ్రువపత్రం అందించారు. అనంతరం దీనిని ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా ఆ వృద్ధిడికి చెప్పారు.. సదరు అధికారులకు ఆ వృద్ధుడు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..



Show Full Article
Print Article
Next Story
More Stories