Major Train Accident: గడిచిన దశాబ్దకాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో..ఒడిశా ట్రైన్ ప్రమాదమే అతిపెద్ద ప్రమాదం..

Major Train Accident: గడిచిన దశాబ్దకాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో..ఒడిశా ట్రైన్ ప్రమాదమే అతిపెద్ద ప్రమాదం..
x

Major Train Accident: గడిచిన దశాబ్దకాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో..ఒడిశా ట్రైన్ ప్రమాదమే అతిపెద్ద ప్రమాదం..

Highlights

Major Train Accident: 2012 మే 22న హుబ్బళ్లి- బెంగళూరు హంపీ ఎక్స్‌ప్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఓ గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది.

Major Train Accident: గడిచిన దశాబ్దకాలంలో దేశంలో జరిగిన రైలు ప్రమాదాల్లో తాజాగా ఒడిశా ట్రైన్ ప్రమాదమే అతిపెద్ద ప్రమాదం. దేశంలో గత 10 ఏళ్లలో జరిగిన రైలు ప్రమాదాలను ఒకసారి గమనిస్తే... 2012 మే 22న హుబ్బళ్లి- బెంగళూరు హంపీ ఎక్స్‌ప్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఓ గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఇందులో 25 మంది చనిపోగా, 43 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో హంపీ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అందులో ఒకటి మంటల్లో చిక్కుకుంది.

ఇక 2014 మే 26న ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌‌నగర్‌ ప్రాంతంలో గోరఖ్‌పుర్‌ వెళుతున్న గోరఖ్‌ధామ్‌ ఎక్స్‌ప్రెస్‌... ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మందికిపైగా గాయపడ్డారు.

2016 నవంబర్‌లో ఇందౌర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌... కాన్పుర్‌లోని పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 150 మంది గాయపడ్డారు.

2017 ఆగస్టు 23న ఢిల్లీ వెళుతున్న కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన 9 బోగీలు ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి గాయాలయ్యాయి. 2017 ఆగస్టు 18న పూరీ-హరిద్వార్‌ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ముజఫర్‌నగర్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 60 గాయపడ్డారు.

2022 జనవరి 13న బీకానేర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పశ్చిమ బెంగాల్‌లో పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 36 మందికి గాయాలయ్యాయి. కాగా తాజాగా ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 280 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందారు.

దశాబ్ద కాలంలో జరిగిన ప్రమాదాలు

తేదీ ట్రైన్ మృతులు

12 మే 2012 హంపి ఎక్స్‌ప్రెస్ 25 మంది

26 మే 2014 గోరఖ్‌దామ్ 25 మంది

20 నవంబర్ 2016 ఇండోర్-పాట్నా 150 మంది

19 ఆగస్ట్ 2017 ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ 23 మంది

13 జనవరి 2022 బికనేర్-గౌహతి 12 మంది

02 జూన్ 2023 కోరమండల్ 280 మంది

Show Full Article
Print Article
Next Story
More Stories