Odisha Plane Crash: ఒడిశాలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్.. పలువురికి గాయాలు
Odisha Plane Crash: ఒడిశాలోని రవూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న ఓ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది.
Odisha Plane Crash: ఒడిశాలో కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్.. పలువురికి గాయాలు
Odisha Plane Crash: ఒడిశాలోని రవూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న ఓ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో జలధ ప్రాంతంలోని పంట పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసింది.
ఈ ఘటనలో పైలట్‌తో పాటు ఆరుగురు గాయపడగా, వారిలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా వెల్లడించారు.
Next Story




