హిజ్రాతో భర్త ప్రేమాయణం.. విషయం తెలిసిన భార్య ఏం చేసిందంటే..!

Odisha: పెళ్లైన ఓ వ్యక్తి హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం భార్యకు తెలిసింది.

Arun Chilukuri
Published on: 13 Sept 2022 10:52 AM IST
Odisha Man Marry Hijra In The Presence Of His Wife
X

హిజ్రాతో భర్త ప్రేమాయణం.. విషయం తెలిసిన భార్య ఏం చేసిందంటే..!

Odisha: పెళ్లైన ఓ వ్యక్తి హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. అయితే ఆమె అందరిలా అరిచి గోల చేయలేదు. ఆమెతో మాట్లాడి భర్త పెళ్లి చేసింది. ఈ సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. డోర్‌కుట్‌ గ్రామానికి చెందిన ఫకీర్‌ నియాల్‌ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నేళ్లు సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఓ హిజ్రా రాకతో కల్లోలం రేగింది.

ఏడాది క్రితం ఫకీర్‌ నియాల్‌కు అదే గ్రామానికి చెందని హిజ్రా సంగీతతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. సంగీతను వదిలి ఉండలేని స్థితికి వచ్చాడు ఫకీర్‌. విషయం తెలుసుకున్న భార్య ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో ఆదివారం సంప్రదాయబద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరును ప్రేమించానని, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story