OBC Bill: ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

OBC Bill: ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇది వరకు ఉన్న అధికారాలను పునరుద్దరించడానికి...

Arun Chilukuri
Published on: 11 Aug 2021 8:55 PM IST
OBC Bill Passed in Rajya Sabha
X

OBC Bill: ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

OBC Bill: ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇది వరకు ఉన్న అధికారాలను పునరుద్దరించడానికి వీలు కల్పించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఇస్తూ చట్ట సవరణ చేసింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలుపగా.. ఇవాళ రాజ్యసభలో సైతం విపక్ష సభ్యులు ఏకతాటిపైకొచ్చి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని మోడీ సహా వివిధ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదొక చారిత్రాత్మక అడుగు అని, దేశంలో 671 కులాలు దీని ద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story