Ajay Mishra: కేంద్ర సహాయ మంత్రి కాన్వాయ్‌పై గుడ్లు విసిరిన NSUI కార్యకర్తలు

Ajay Mishra: అజయ్‌ మిశ్రా ఒడిశా పర్యటనలో చేదు అనుభవం

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 5:12 PM IST
NSUI Activists Throw the Eggs on Minister Ajay Mishra Convoy
X

మంత్రి కన్వేయ్ పై గుడ్లు విసిరినా NSUI కార్యకర్తలు (ఫైల్ ఇమేజ్)

Ajay Mishra: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాకు ఒడిశా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ బయట అజయ్ మిశ్రా కాన్వాయ్‌పైకి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా భారీగా బలగాలను మోహరించారు. వారిని తప్పించుకొని కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నేతలు కాన్వాయ్‌పై గుడ్లు విసిరారు. కటక్‌లోని ముండులిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఒడిశాకు రాగా మంత్రికి వ్యతిరేకంగా ఎన్‌యూఎస్‌యూ నేతలు నల్లజెండాలను ప్రదర్శించగా.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story