మార్చి 1నుంచి సామాన్యులకు కరోనా వ్యాక్సినేషన్‌

మార్చి 1నుంచి సామాన్యులకు కరోనా వ్యాక్సినేషన్‌
x

మార్చి 1నుంచి సామాన్యులకు కరోనా వ్యాక్సినేషన్‌

Highlights

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించిన కేంద్ర మంత్రివర్గం సామాన్యులకు కూడా...

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించిన కేంద్ర మంత్రివర్గం సామాన్యులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఒకవైపు మళ్లీ కేసులు పెరుగుతుండటం మరోవైపు కొత్త రకం కరోనా వేరియంట్స్‌ విజృంభిస్తుండటంతో 60ఏళ్లు పైబడిన వారికి ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అలాగే, దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడ్డవారికి కూడా కరోనా టీకాలు ఇవ్వనున్నారు.

మార్చి 1నుంచి సామాన్యులకు అందజేసే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను 10వేల ప్రభుత్వాస్పత్రులు, 20వేల ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేపట్టనున్నారు. అయితే, ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్‌‌ను పూర్తి ఉచితంగా అందజేయనుండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేయించుకునే కరోనా టీకాకు ఎంత ధర చెల్లించాలో‌ రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, 60ఏళ్లు పైబడ్డవారు దేశంలో 10కోట్ల మందికి పైగా ఉంటారని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా కరోనా టీకాలను సిద్ధంచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories