Rahul Gandhi: జైల్లో పెట్టి నా పోరాటాన్ని ఆపలేరు.. అదానీతో ఉన్న సంబంధాలు బయటపెట్టా్ల్సిందే..

Rahul Gandhi: జైల్లో వేసినంత మాత్రాన తన పోరాటం ఆగదన్నారు రాహుల్ గాంధీ.

Arun Chilukuri
Updated on: 25 March 2023 2:14 PM IST
Not Scared of Jail, Will Keep Asking Questions, Says Rahul Gandhi
X

Rahul Gandhi: జైల్లో పెట్టి నా పోరాటాన్ని ఆపలేరు.. అదానీతో ఉన్న సంబంధాలు బయటపెట్టా్ల్సిందే..

Rahul Gandhi: జైల్లో వేసినంత మాత్రాన తన పోరాటం ఆగదన్నారు రాహుల్ గాంధీ. అదానీ షెల్ కంపెనీల్లో 20వేల కోట్లు ఎవరివో చెప్పాలన్న రాహుల్.. అదానీ, మోడీల సంబంధాలపై ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానన్నారు రాహుల్.

తనపై అనర్హత వేటు వేసినా తగ్గేదేలే అంటున్నారు రాహుల్ గాంధీ. సస్పెన్షన్ తర్వాత ప్రెస్‌మీట్ నిర్వహించిన రాహుల్ గాంధీ.. తన వాయిస్ మరింత పెంచారు. అదానీ, మోడీ సంబంధాలపై ప్రశ్నించినందుకు వేటు వేశారన్న రాహుల్.. ఇలాంటి ఎత్తుగడలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తనను జైల్లో పెట్టినా.. ఏం చేసినా ప్రశ్నించడం ఆగదన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ మరోసారి కామెంట్ చేసిన రాహుల్.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తన పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. అదానీ, మోడీ సంబంధాలపై ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story