Nirmala Sitharaman: బ్యాంకులన్నిటినీ ప్రయివేటీకరించబోము: నిర్మల

Nirmala Sitharaman: బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 16 March 2021 9:45 PM IST
Not all public sector banks to be privatised: Nirmala Sitharaman
X

బ్యాంకులన్నిటినీ ప్రయివేటీకరించబోము: నిర్మల

Nirmala Sitharaman: బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. బ్యాంకులన్నిటినీ ప్రైవేటీకరించే ఆలోచన లేదని చెప్పారామె. ఏ బ్యాంకునైనా ప్రైవేటీకరిస్తే, అందులో పని చేసే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని చెప్పారు. బాగా ఆలోచించిన తర్వాతే బ్యాంకుల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్యాంకులకు మరింత ఎక్కువ ఈక్విటీ రావాలని, దేశ ప్రజల ఆకాంక్షలను బ్యాంకులు నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో తొమ్మిది సంఘాలు సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి ప్రయివేటీకరణపై వివరణ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story