Corona Vaccine: దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదు- కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

Corona Vaccine: దేశంలో వ్యాక్సిన్ల కొరత అన్నది లేనే లేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు.

Arun Chilukuri
Published on: 14 April 2021 6:29 PM IST
No Vaccine Shortage in India Says Health Minister
X

Corona Vaccine: దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదు- కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్

Corona Vaccine: దేశంలో వ్యాక్సిన్ల కొరత అన్నది లేనే లేదని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. రాష్ట్రాలకు డిమాండ్ల వారీగా, అవసరాన్ని, అందుబాటులో ఉన్న టీకాలను గుర్తించి సప్లయ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రాలు తాము అందుకున్న వ్యాక్సిన్లను సరైన దిశగా వినియోగించాలని ప్రతీ ఆస్పత్రిలో స్టాక్, టీకాల వినియోగంపై ఒక నివేదిక, కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రెమిడిసివర్ టాబ్లెట్స్ అందుబాటులో లేకపోవడంపై చర్యలు తీసుకుంటున్నామని కొన్ని చోట్ల రెమిడిసివర్ ధరలు పెంచినట్లు, బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు ఆరోపణలు అందాయని, ఆరా తీస్తున్నామని హర్ష వర్ధన్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story