Prashant Kishor: బీజేపీని ఓడించాలంటే సెకండ్ ఫ్రంటే క‌రెక్ట్

Prashant Kishor: బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Updated on: 30 April 2022 9:30 PM IST
No Third Front can win Polls in India Says Prashant Kishor
X

Prashant Kishor: బీజేపీని ఓడించాలంటే సెకండ్ ఫ్రంటే క‌రెక్ట్

Prashant Kishor: బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వ‌చ్చని పీకే సూచించారు. ఓ జాతీయ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో పీకే ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌ను థ‌ర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్రశ్నించ‌గా.. అది కుదిరే ప‌నికాదన్నారు.

థ‌ర్డ్ ఫ్రంట్‌, ఫోర్త్ ఫ్రంట్ ఈ దేశంలో గెలుస్తుంద‌న్న నమ్మకం తనకు లేదన్నారు. ఒక‌వేళ బీజేపీని ఫ‌స్ట్ ఫ్రంట్‌గా భావిస్తే, సెకండ్ ఫ్రంట్‌గా ఎదిగిన వారు బీజేపీని ఓడిస్తారని పీకే చెప్పుకొచ్చారు. బీజేపీని ఎవ‌రైనా ఓడించాలంటే వారు సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎద‌గాల్సిందేనని పీకే స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను సెకండ్ ఫ్రంట్‌గా భావిస్తారా? అని ప్రశ్నించ‌గా.. పీకే తోసిపుచ్చారు. కాంగ్రెస్ అనేది దేశంలో అతిపెద్ద రెండో పార్టీ అని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story