Ramdev Baba: నన్ను అరెస్ట్‌ చేయడం మీ నాన్న వల్ల కూడా కాదు

Ramdev Baba: అల్లోపతి మందుల గురించి యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్నే రేపుతున్నాయి.

Samba Siva Rao
Published on: 27 May 2021 8:13 PM IST
Ramdev Baba: నన్ను అరెస్ట్‌ చేయడం మీ నాన్న వల్ల కూడా కాదు
X

రాందేవ్ బాబా (Thehansindia)

Ramdev Baba: అల్లోపతి మందుల గురించి యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారాన్నే రేపుతున్నాయి. రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ డివిజన్ పరువు నష్టం నోటీసును పంపించింది. రాందేవ్ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం రూ.1000కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాందేవ్‌ బాబా లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేయాలని లేదంటే రూ.1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్‌ డివిజన్ నోటీసులు పంపింది.

రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. తనను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఆయన అన్నారు. వాళ్ల బాబులు కూడా తనను అరెస్ట్ చేయలేరని అన్నారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు.

కరోనా ఫస్ట్ వేవ్ లో 753 డాక్టర్లు, సెకండ్ వేవ్ లో 513 మంది వైద్యులు చనిపోయారని.. వీరెవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజల్లో భయాలను కలిగించేలా రాందేవ్ వ్యవహరిస్తున్నారని మోదీకి రాసిన లేఖలో ఐఎంఏ తెలిపింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత కూడా దేశంలోని 10 వేల మంది డాక్టర్లు మరణించారంటూ రెండు వీడియోల్లో బాబా రాందేవ్ ఆరోపించారని చెప్పింది. పతంజలి సంస్థ అధినేత రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రాచీన కాలం నుంచి మన ఆయుర్వేద శాస్త్రం యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిందని అటువంటి ఆయుర్వేదాన్ని కాదని, అల్లోపతి మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నారని దేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడానికే ఇది జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి అనేది పనికిమాలిన సైన్స్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story