హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో స్థానికుల వినూత్న నిరసన

Haryana: సెక్టార్‌ 46లో గుంతలమయమైన రోడ్లు

Jyothi
Published on: 26 Jun 2022 10:18 AM IST
No Access To Smooth Road, Protesters In Sec 46 Plant Saplings In Potholes
X

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో స్థానికుల వినూత్న నిరసన

Haryana: హర్యానా రాష్ట్రం గరుగ్రామ్‌లో రోడ్ల దుస్థితి అధ్వానంగా మారడంతో స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. సెక్టార్ 46లో రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో అదే గుంతల్లో మొక్కలు నాటి తమ నిరసన వ్యక్తం చేశారు. ఐదేళ్ల నుంచి రోడ్లకు మరమ్మతులు చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు.

చివరిసారిగా 2017లో రోడ్లు వేశారని, అప్పటి నుంచి రోడ్లకు మరమ్మతులు చేయని కారణంగా మరింత దెబ్బతిన్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టిచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు రోడ్ల మరమ్మతుల పనులకు ఆమోదం తెలిపామని, ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story