బిహార్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్న నితీశ్

Arun Chilukuri
Published on: 16 Nov 2020 11:59 AM IST
బిహార్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్న నితీశ్
X

బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌లో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్‌ కిశోర్‌ ప్రసాద్, బెత్తాహ్‌ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్‌ కుమార్‌ మోడీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి.

మరోవైపు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కంటే జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఆమోదించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story