స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ ప్రకటన చేసిన నితీశ్ కుమార్

Nitish Kumar: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీహార్ లోని యవతకు సీఎం నితీశ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు.

Arun Chilukuri
Published on: 15 Aug 2022 4:49 PM IST
Nitish Kumar Big Bihar Announcement on  Jobs
X

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ ప్రకటన చేసిన నితీశ్ కుమార్

Nitish Kumar: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీహార్ లోని యవతకు సీఎం నితీశ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వ హామీల మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, సీఎం నితీష్‌ వ్యాఖ్యల మేరకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ కనుక అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్‌ హామీ ఇచ్చారు. కానీ, ఆర్జేడీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఇక, తాజాగా జేడీయూతో కలిసి ఆర్జేడీ అధికారంలోకి రావడంతో అప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేలా సీఎం నితీష్‌.. నేడు ఇలా గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story