Nita Ambani: ప్రధాని మోడీ, ముకేశ్ అంబానీ వీరిలో ఎవరు గొప్ప.. నీతా అంబానీ ఆసక్తికర సమాధానం..

Nita Ambanis answer to rapid fire question on mukesh ambani
x

ప్రధాని మోడీ, ముకేశ్ అంబానీ వీరిలో ఎవరు గొప్ప.. నీతా అంబానీ ఆసక్తికర సమాధానం..

Highlights

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ర్యాపిడ్‌ ఫైర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న వారంతా చిరునవ్వులు చిందించారు.

Nita Ambani: రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ర్యాపిడ్‌ ఫైర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న వారంతా చిరునవ్వులు చిందించారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ.. అక్కడ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురైన కొన్ని ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చారు.

ఇంటర్వ్యూలో భాగంగా ప్రధాని మోడీ, ముకేష్ అంబానీ వీరిద్దరిలో మీకు ఎవరు గొప్ప అని నీతాకి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ప్రధాని మోడీతో దేశానికి చాలా మంచి జరుగుతోందన్నారు. ఇక తన భర్త ముకేష్ అంబానీతో తన ఇంటికి మంచి జరుగుతోందని సమాధాన మిచ్చారు. ఆమె ఇచ్చిన జవాబుతో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారంతా చిరునవ్వులు చిందించారు. తెలివైన సమాధానం ఇచ్చారంటూ చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నీతా సమాధానం సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నీతా అంబానీ కీలక ఉపన్యాసం చేశారు. భారత వాణిజ్యం, విధానాలు, సంస్కృతి వంటి అంశాలపై మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో భారత కళలు, సంస్కృతిలోని వివిధ కోణాలు, అవి పోషించే గణనీయమైన పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా నీతా అంబానీకి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. దాతృత్వం, సామాజిక సేవా కార్యక్రమాలతో గ్లోబల్ ఛేంజ్ మేకర్‌గా నీతా అంబానీ నిలుస్తున్నారని మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు గాను బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ప్రశంసాపత్రాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ చేతుల మీదుగా నీతా అంబానీ అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. నీతా అంబానీ రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్. ఎక్కడా ఆమె వైభవం తగ్గదు. ఈవెంట్లకు తగ్గట్టు కట్టుబొట్టుతో ఆకట్టుకుంటుంటారు. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు తీసిపోని రీతిలో ఫ్యాషన్‌ను ప్రదర్శిస్తుంటారు. పూజా, వివాహ కార్యక్రమాలకు సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చే నీతా.. బిజినెస్ ఈవెంట్లలో అందుకు తగ్గట్టు దుస్తులను ధరిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories