Nirmala Sitharaman: పసిడి పరుగుకు కారణం అదే.. బంగారం దిగుమతులపై ఆందోళన అవసరం లేదు

Nirmala Sitharaman: పసిడి పరుగుకు కారణం అదే.. బంగారం దిగుమతులపై ఆందోళన అవసరం లేదు
Nirmala Sitharaman: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడానికి ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడమే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
Nirmala Sitharaman: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడానికి ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడమే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆమె ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై స్పందించారు.
బంగారం దిగుమతులపై ఆందోళన లేదు:
దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, అది ఆందోళనకర స్థాయిలో లేదని మంత్రి స్పష్టం చేశారు. "దిగుమతులను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. కరెంట్ ఖాతా లోటు (CAD) ప్రస్తుతం నియంత్రణలో ఉంది, కాబట్టి బంగారం దిగుమతులపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు" అని ఆమె పేర్కొన్నారు. బ్యాంకులు తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించాలని, దేశ వృద్ధిలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
అమెరికా 15 శాతం సుంకాలపై స్పందన:
వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, భారత్ సహా అన్ని దేశాలపై 15 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "ఈ పరిణామాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ నిశితంగా సమీక్షిస్తోంది. దీని ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది" అని నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు.
వృద్ధి పథంలో భారత్:
భారత్ ప్రస్తుతం వేగవంతమైన వృద్ధి పథంలో ఉందని, పరిశ్రమలు తమ పెట్టుబడులను పెంచడం ద్వారా ఈ ప్రయాణంలో తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. ఆర్‌బీఐ మరియు ప్రభుత్వం సమన్వయంతో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతున్నాయని భరోసా ఇచ్చారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



