Nirmala Sitharaman: క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Nirmala Sitharaman: నిషేధంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి

Sandeep Eggoju
Published on: 1 Dec 2021 7:58 AM IST
Nirmala Sitharaman Key Comments on Cryptocurrency
X

నిర్మల సీతారామన్ (ఫైల్ ఇమేజ్)

Nirmala Sitharaman: దేశంలో క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో మంగళవారం డిజిటల్ కరెన్సీకి సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ సామర్థ్యంపై విస్తృతంగా చర్చలు జరిగాయని, ప్రభుత్వం త్వరలో బిల్లును తీసుకువస్తుందని చెప్పారు. క్రిప్టో కరెన్సీపై బిల్లును కేంద్రం ఆమోదించిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని చెప్పారు. బిల్లులో అన్ని విషయాలు ఉంటాయని.. అప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోదని అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story