Tulsi Gabbard: తులసి గబ్బార్డ్‌కు కంగ్రాట్స్ చెప్పిన నిర్మలా సీతారామన్

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2024 7:56 PM IST
Tulsi Gabbard: తులసి గబ్బార్డ్‌కు కంగ్రాట్స్ చెప్పిన నిర్మలా సీతారామన్
X

Nirmala Sitharaman congratulates Tulsi Gabbard: అమెరికా కొత్త ప్రభుత్వంలో నేషనల్ ఇంటెలీజెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన తులసి గబ్బార్డ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రాట్స్ చెప్పారు. గతంలో తాను తులసి గబ్బార్డ్‌ను కలసినప్పటి ఫోటోనూ కేంద్ర మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తులసి గబ్బార్డ్ కెరీర్‌ను నిర్మలా సీతారామన్ క్లుప్తంగా ప్రస్తావించారు. "తులసి గబ్బార్డ్ అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో సైనికురాలిగా, లెఫ్టినెంట్ కల్నల్‌గా 21 ఏళ్ల పాటు సేవలు అందించారు" అని గుర్తుచేసుకున్నారు. మీతో మాట్లాడిన కొన్ని సందర్భాలలోనే మీ ఆలోచనలు, అంకిత భావం తనను ఎంతో ఇంప్రెస్ చేశాయని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story