Nirav Modi: నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు

Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 21 July 2021 7:16 PM IST
Nirav Modi Says Extradition to India Would Severely Impact his Mental Health
X

Nirav Modi: నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు

Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భారత్ కు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమని నీరవ్ మోడీ చెప్పారు. దేశంలోని ఆర్ధిక నేరాల్లో నిందితుడు కావడంతో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలు ఇచ్చింది. ఇండియాలో మనీలాండరింగ్, నమ్మకద్రోహం వంటి నేరారోపణలు ఎదుర్కోనాల్సిందేనని కోర్టు తేల్చింది. లండన్ కోర్టుకు నీరవ్ మోడీ అప్పీల్ కు వెళ్లారు. కోర్టు తీరస్కరించడంతో ఇండియాకు అప్పగించే మార్గం సుగమమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story